ఏపీ సీఎం పీఎస్నంటూ కొత్త తరహామోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
మనం నిత్యం అప్డేట్ అవుతున్నామో లేదో తెలియదు గానీ సైబర్ నేరగాళ్లు మాత్రం రోజు అప్డేట్ అవుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ రెచ్చిపోతున్నారు.కాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా సీఎం పీఎస్నంటూ పలువురికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు పీఎస్నంటూ పలువురు పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులకు కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆ వ్యక్తి తన వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తించి మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.

