కల్లు సీసాలో కట్ల పాము
కల్లు సీసాలో కట్ల పాము కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. సంక్రాంతి పండగ సందర్భంగా చుట్టాలతో కలిసి సరదాగా కల్లుదుకాణం దగ్గరకు వెళ్లిన కల్లు ప్రియులకు ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది.దీంతో కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో కొంత మంది వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ కల్లు దుకాణానికి వెళ్లారు.అందులో ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో మెలికలు తిరుగుతున్న పాము పిల్ల కనిపించింది.ఇదేదో పాములా ఉందని చూస్తే..తీరా ఆ కల్లు సీసాలో చనిపోయిన కట్ల పాము పిల్ల కనిపించింది.దీంతో కల్లుతాగే వ్యక్తి బిత్తరపోయాడు.సీసా పడేసి పాముని పేపర్ పై ఉంచి గీత యజమానికి చూపించాడు.దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుకుంది.ఈ నేపథ్యంలో దుకాణాన్ని ధ్వంసం చేశారు.ఇరు వర్గాల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.