Home Page SliderInternational

నాకు కస్టమర్స్ రివ్యూ చాలా ముఖ్యం: APPLE CEO

మీరు మార్కెట్‌లో గానీ,ఆన్‌లైన్‌లో గానీ ఎప్పుడైనా ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే ముందుగా ఏం చేస్తారు? వెంటనే చాలామంది రివ్యూ చూస్తామని చెప్తారు. అంటే మనం ఏదైనా వస్తువు కొనాలంటే మనకి అన్నింటి కంటే ముందు రివ్యూ చాలా ముఖ్యం కదా. అయితే ఈ రివ్యూ అనేది మనకి మాత్రమే కాదు. ఈ వస్తువును తయారు చేస్తున్న కంపేనీకి కూడా చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ రివ్యూ కంపెనీకి ఎంత ముఖ్యమంటే కంపెనీ యొక్క లాభా,నష్టాలన్నీ కూడా దానిపై ఆధారపడి ఉంటాయి. దీంతో ప్రపంచంలోని చాలా కంపెనీలు కస్టమర్ రివ్యూకి చాలా ప్రాధాన్యత ఇస్తాయి. అలాగే ప్రపంచంలోని ప్రముఖ మొబైల్ కంపెనీ యాపిల్ కూడా కస్టమర్ రివ్యూకి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. కాగా యాపిల్ సిఈఓ టిమ్ కుక్  యాపిల్ కంపెనీ తయారు చేసి,విక్రయించే మొబైల్ ఫోన్ కస్టమర్ రివ్యూను ప్రతి రోజు  స్వయంగా చదువుతారంటా. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా యాపిల్ కంపెనీ విజయానికి గల కారణాలను GQ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో టిమ్ కుక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..ప్రతిరోజు ఉదయం 5 గంటలకే కస్టమర్లు పంపిన ఫీడ్‌బ్యాక్‌ను చదవడం ప్రారంభిస్తానన్నారు. మీలో ఎవరైనా టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ కలిగి ఉంటే దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో,ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు.