Home Page SliderTelangana

చైతూ చెప్పిన ‘కస్టడీ’ కథ

కస్టడీ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు యువ స్టార్ చైతన్య. ఈ సినిమా కోసం చాలా కష్టపడానంటున్నారు హీరో చైతన్య. దీనిలో పోలీస్‌గా నటించిన చైతూ ఈ సినిమా కోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నారట. ఈ సినిమా కథ 80,90 వ దశకాలలో నడిచిన స్టోరీ అని తెలియజేశారు. ఈ సినిమాలో తన లుక్ కొంచెం తన తండ్రి నాగార్జునలా కనిపించినా అది కావాలని చేసింది కాదని, అప్పటి కాలానికి తగినట్లు తన క్యారెక్టర్‌ను రూపొందించారని చెప్పారు. ఈ కథలో కృతి శెట్టి పాత్రలో ట్విస్ట్ ఉంటుందని, రోజా హీరో అరవింద్ స్వామి విలన్‌ అయినా కూడా అతని క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రియమణి, శరత్ కుమార్ల క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని, ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లు కలిసి మూవీలో మ్యాజిక్ చేసారని చెప్పారు. సినిమాను వెండితెరపై చూస్తేనే అసలు విషయాలు రిలీవ్ అవుతాయని అసలు స్టోరీని సస్పెన్స్‌లో పెట్టారు చైతూ.