Home Page SliderNational

ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీ పొడిగింపు

కర్ణాటకలో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారం చేయడంతోపాటు ఆ దృశ్యాలను చిత్రీకరించారనే ఆరోపణల కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ కస్టడీని కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు పొడిగించింది. కాగా రేవణ్ణ ప్రస్తుతం ఈ కేసులో సిట్ కస్టడీలో ఉన్నారు. అయితే కర్ణాటక కోర్టు గతంలో ఆయనకు జూన్ 18 వరకు కస్టడీ విధించి మళ్లీ దానిని పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.