46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
టిజి: వానాకాలం పంటల సాగును ఈసారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్‌లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

