Home Page SliderTelangana

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ ను సత్కరించిన  సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్

పవర్‌ఫుల్ పంచ్‌లతో 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 50 కిలోల విభాగంలో  బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించారు  నిఖత్ జరీన్. ఆమెను నేడు బీఆర్ కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ లు  దుశ్శాలువా, పుష్పగుచ్చాలతో అభినందించారు.  ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి భారత దేశంతో పాటు తెలంగాణా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపారని ఆమెను సీఎస్ శాంతి కుమారి అభినందించారు.

ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, నేటి యువ క్రీడాకారులకు జరీన్ ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు.