HealthHome Page SliderInternational

ఏడుపు కూడా మంచిదే..

ఒక్కొక్క సందర్భంలో ఏడవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. కొందరు చిన్న చిన్న విషయాలకే ఏడుపందుకుంటారు. మరికొందరు ఎంతటి దుఃఖానయినా మనసులోనే దాచుకుంటారు. కానీ ఈ రెండు పద్దతులూ అంత మంచిది కాదు. ఆరోగ్యం కాదు. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో ఏడుపు వల్ల చాలా లాభాలున్నాయని నిర్థారించారు. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోను రిలీజవుతుంది. దీనివల్ల బాధతో ముడుచుకుపోయిన నరాలన్నీ రిలాక్స్ అవుతాయి. దీనివల్ల ఇది సహజ పెయిన్ కిల్లర్‌గా పని చేస్తుంది. ఏడుపు వల్ల మనసులో భారం తగ్గి, తేలిక పడుతుంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి. రాత్రి నిద్రపోయే సమయానికి ఎలాంటి బాధను మనసులో ఉంచుకోకూడదు.

హాయిగా నిద్రపోవాలంటే బాధను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటే మనసు కుదుట పడుతుంది. దీనితో నిద్ర వస్తుంది. కళ్ల ఆరోగ్యానికి కూడా కన్నీళ్లు ఎంతో మంచివి. కళ్లలో ఉండే మలినాలు, దుమ్ము కన్నీళ్ల ద్వారా బయటకి వస్తాయి. తద్వారా కళ్లు తేమను పొంది డ్రైఐస్ సమస్య తగ్గుతుంది. దృష్టి కూడా మెరుగవుతుంది. పసిపిల్లలు కూడా పుట్టిన వెంటనే ఏడవక పోతే అందుకే డాక్టర్లు ఏడిపిస్తారు. వారు ఏడవడం వల్ల శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు. అంతేకాదు, ఏడుపు వల్ల వారు తాగిన పాలు కూడా తొందరగా జీర్ణమవుతాయి. మనుషులలో ఎక్కువగా పురుషుల కంటే స్త్రీలే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అందువల్లే పురుషుల కంటే స్త్రీలకు గుండెజబ్బులు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ.