“చస్తే చావండి, ఎవ్వరూ పట్టించుకోరంటూ” వైసీపీ నాయకుని దారుణ వ్యాఖ్యలు
కర్నూల్ జిల్లా అదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, టీడీపీ నేతలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా టిడిపి నేతలు చేస్తున్న చర్యలను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. టిడిపి వారు గుండు గీయించుకోవడం, ఉరితాళ్లతో ఫోజులివ్వడం, పశువులకు వినతి పత్రాలివ్వడం, నిరాహార దీక్షలు చేయడం వంటి చేష్టలతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఉరితాడుతో ఫోజులిచ్చే బదులు నిజంగానే ఉరేసుకుంటే సరిపోతుంది కదా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో చంద్రబాబు బయటకు రాలేడని, కనీసం మూడు నెలలు పడుతుందని, ప్రజలెవ్వరూ వీరిని పట్టించుకోరని, తాము కూడా పట్టించుకోమని తెలియజేశారు. కేవలం సానుభూతి సంపాదించడానికే వీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పశువులకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల చిత్రాలు కట్టినవారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.