Home Page SliderNationalSpiritual

ముంబై టోల్ ఫీజుపై కీలక నిర్ణయం

ముంబైలోనికి ప్రవేశించే కీలక టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై వెలుపల ఐదు టోల్ ప్లాజాల వద్ద లైట్ మోటర్ వాహనాలకు ఇకపై టోల్ చార్జీలు ఉండవని ముఖ్యమంత్రి షిండే పేర్కొన్నారు. వీటి మీదుగా రోజూ 2.8 లక్షల మంది ముంబయిలోకి రాకపోకలు కొనసాగిస్తున్నారు. వీరికి లాభాన్ని చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, రద్దీని, సమయం, ఇంధనం వృధాను అరికట్టడానికి కూడా వీలుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీంలు పెడుతోందని, నిన్న జరిగిన సిద్దిఖి హత్యను దారి మళ్లించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.