శ్రీశైలం టన్నెల్ కార్మికుల కీలక నిర్ణయం
శ్రీశైలం SLBC టన్నెల్ ప్రాజెక్టు కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ప్రమాద ఘటనతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టన్నెల్ ప్రాజెక్టు పని కోసం వచ్చిన వారు తమ స్వస్థలాలకు తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఇంత జరిగాక ఈ సొరంగంలోకి వెళ్లాలంటే తమకు చాలా భయంగా ఉందని చెప్పారు. వీరిని కాంట్రాక్టు పనిపై మహారాష్ట్రలోని మేఘా కంపెనీ తీసుకువచ్చింది. ఒక కార్మికుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఘటన జరిగిన తర్వాత రోజు తాను ఆ టన్నెల్‌వద్దకు వెళ్లానని మొత్తం నీటితో నిండిపోయి ఉందని, కంపెనీ సిబ్బంది ఎవరూ అక్కడ లేరని పేర్కొన్నారు.