జానీ మాస్టర్ అవార్డు రద్దుపై పోలీసుల కీలక నిర్ణయం
పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అవార్డు కమిటీ పేర్కొంది. ఈ సందర్భంలో అవార్డు కోసం మధ్యంతర బెయిల్ పొందిన జానీ మాస్టర్ బెయిల్ నిలిపివేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. తనపై పలుమార్లు మైనర్‌గా ఉండగానే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేయడంతో అతనిని అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశారు. జామీ మాస్టర్‌కి ఈనెల 6 నుండి 10 వ తేదీ వరకూ నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్లడానికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు మళ్లీ పిటిషన్ వేస్తున్నారు.

