పాలప్యాకెట్ల కోసం ఎగబడుతున్న జనం
విజయవాడలో తీవ్ర పాలకొరత ఏర్పడింది. జనం పాలప్యాకెట్ల కోసం ఎగబడుతున్నారు. వరద నీరు విజయ డెయిరీ యూనిట్‌ను ముంచెత్తింది. బుడమేరు ఉధృతితో డెయిరీలోకి వర్షపునీరు చేరింది. దీనితో డెయిరీ యూనిట్ లోపల నడుంలోతుకు నీరు చేరి, 1.50 లక్షల లీటర్ల పాల ప్యాకెట్లు,పెరుగు పేకెట్లు నీటమునిగాయి. దీనితో నిత్యావసరాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు రవాణా సదుపాయం స్తంభించి పోవడంతో సరుకులు సమయానికి అందడం లేదు. రోడ్లపై లైఫ్ బోట్లతో సరుకులు, నిత్యావసరాలు, పాలపేకెట్లు సరఫరా చేస్తున్నారు.

