యాదాద్రిలో కుంగిన ఫ్లోరింగ్
దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధ నరసింహక్షేత్రమైన తెలంగాణలోని యాదాద్రిలో ఉన్న యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఫ్లోరింగ్ మరో సారి కుంగింది.దీంతో ఆలయ నిర్మాణ లోపాలు బహిర్గతమయ్యాయి. గత రెండేళ్ల కిందట ఆలయ దక్షిణ భాగంలోని ప్రాకార మండప తిరువీధుల్లో ఫ్లోరింగ్ కుంగింది.గురువారం అదే ప్రాంతంలో మళ్లీ ఫ్లోరింగ్ కుంగింది.దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలా పదే పదే కుంగడం పట్ల భక్తులు అపశకునంగా భావిస్తున్నారు.

