InternationalNews

హైదరాబాద్‌ చేరుకున్న క్రికెటర్లు

ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వచ్చేశారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు శంషాబాద్‌ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత ఆటగాళ్లకు పార్క్‌ హయాత్‌ హోటల్‌లో, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తాజ్‌కృష్ణ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు దేశాలూ 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. దీంతో ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ నిర్ణయాత్మకం కానుంది. ట్వంటీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాపై సిరీస్‌ గెలుచుకుంటే భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.