Home Page Sliderhome page sliderTelangana

ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి వేషాలు..

సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం అడ్డమైన కంటెంట్ తో చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా? అంటూ ప్రశ్నించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా? అని నిలదీశారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమా లోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.