ఢీకొన్న లారీలు.. క్యాబిన్లలో ఇరుక్కున్న డ్రైవర్లు
మహబూబాబాద్ ఇల్లందు రహదారిపై అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోవడంతో నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి పోలీసులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్రేన్స్, జేసీబీలు, గ్యాస్ కటర్స్ సహాయంతో వారిని కాపాడారు. గ్యాస్ కటర్ వాడుతుండగా డీజిల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా అధికారులు ఫైర్ ఇంజన్ ను రప్పించారు. ప్రమాదం జరగ్గానే సకాలంలో స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు.