సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. రాజ్యసభ ఎంపీగా సుదీర్ఘ కాలం పనిచేశారు సీతారాం ఏచూరి. సీపీఎం పార్టీలో ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన 1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. 1985లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా ఇదే పదవిలోనే పనిచేస్తూ కన్నుమూశారు. ఆయన ఢిల్లీలో డిగ్రీ, పీజీ చదివారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా ఎన్నికయ్యారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తరపున అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.

