Home Page SliderTelangana

BRS, కాంగ్రెస్‌లు అవినీతి పార్టీలే అన్న సీపీఎం రాఘవులు

పటాన్‌చెరు: బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒకదానిపై ఒకటి తమ అవినీతిని ప్రకటనలపై లక్షలు ఖర్చుపెట్టి బట్టబయలు చేసుకుంటున్నాయని, ఎవరూ నిజాయితీగా లేరని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. వారెవరైనా సీపీఎంపై ప్రకటన ఇవ్వమంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే సీపీఎం అవినీతి చేయలేదు కాబట్టి అని చెప్పారు. పటాన్‌చెరు సీపీఎం అభ్యర్థి మల్లికార్జున్‌రావుకు మద్దతుగా ఆదివారం బీరంగూడ నుండి రుద్రారం వరకూ చేపట్టిన బైక్‌ర్యాలీతో కూడిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత పరిశ్రమలపై వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసేందుకు ఖర్చు పెట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. నాలుగు లేబర్‌కోడ్‌లు తీసుకువచ్చి శ్రామికవర్గ ఏజిటేషన్లు అణచివేయాలని కేంద్రం చూస్తోందన్నారు. అన్ని సెక్టార్లను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే పనిలో ఉందని ఆరోపించారు. ప్రతి పైసా ప్రజలకోసం ఖర్చుచేసే కార్మికుల కోసం శ్రమించే వ్యక్తిని గెలిపించుకుందామన్నారు.