పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత నారాయణ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విపక్షాలు గత రెండు రోజులుగా బెంగుళూరులో భేటి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను NDA కూటమిలో చేరుతానని ప్రకటించారు. అయితే దీనిపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చి,పవన్ ఇప్పుడు NDAలో ఎలా చేరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఒక దళారీ అని..అందుకే బీజేపీ-టీడీపీకి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా పవన్ నిన్నటివరకు చేగువేరా దుస్తులు వేసుకొని,ఇప్పుడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్దమయ్యారన్నారు. అయితే రేపు పవన్ కళ్యాణ్ గాడ్సేలా తుపాకీ కూడా పట్టుకుంటారని ఆయన విమర్శించారు. కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలల్లో నిలకడగా లేరని నారాయణ ఎద్దేవా చేశారు.

