జాతీయ జెండాను ఆవిష్కరించిన సీపీ ఐపీఎస్ సుధీర్
పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్ సుధీర్ బాబు సూచించారు. రాచకొండ కమిషనరేట్, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

