Home Page SliderNational

తండ్రి, కుమార్తెపై ఆవు దాడి

ఓ ఆవు బైక్ పై వెళ్తున్న తండ్రి కుమార్తెపై దాడికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనూర్‌లో జరిగింది. తండ్రి కూతురు బైక్ పై నుంచి కిందపడినా వదలకుండా ఆవు కొమ్ములతో పొడిచే ప్రయత్నం చేసింది. పలువురు వచ్చి అడ్డుకోబోగా వారిపై కూడా ఆవు దాడికి దిగింది. ఈ దాడిలో తండ్రి కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.