పురందేశ్వరిపై సొంతపార్టీలో అసంతృప్తి కోవర్టు ముద్ర
ఆంధ్రప్రదేశ్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఆమె టీడీపీ కోవర్టుగా, స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని కమలం నేత ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి ఆమె ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని ఆరోపించారు. అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబును సమర్థించడం మంచిది కాదన్నారు. కాగా, రాష్ట్ర నేతల్లో చాలామంది బాబుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

