పతంజలి రామ్‌దేవ్ బాబాకు కోర్టు వార్నింగ్..
పతంజలి సంస్థ స్థాపకుడు రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఆయన పూర్తిగా కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నాడంటూ మండిపడింది. ఇటీవల పతంజలికి చెందిన గులాబీ షర్భత్‌ను ప్రమోట్ చేసే క్రమంలో హమ్‌దర్ద్ నేషనల్ ఫౌండేషన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని దాఖలైన పిటిషన్‌పై విచారించింది. గతంలోనే ఆయనపై కోర్టు కొన్ని హెచ్చరికలు చేసిందని, అవి పట్టించుకోకుండా మళ్లీ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నారని నోటీసులు జారీ చేసింది. విషయం ఏంటంటే హమ్‌దర్ద్‌కు సంబంధించిన రూఫ్ అఫ్జా డ్రింక్ సేల్స్‌తో ఆ సంస్థ మదర్శాలు, మసీదులు కడుతోందని ఆయన ఆరోపించారు. దీనితో మండిపడ్డ కోర్టు ఆయన తన సొంత ప్రపంచంలో నివసిస్తూ పూర్తిగా కంట్రోల్ తప్పారని వ్యాఖ్యానించింది.