ప్రధాని డిగ్రీపై కోర్టు తీర్పు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు వెల్లడించాలంటూ ఢిల్లీ యూనివర్సిటీని గతంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని డిగ్రీపై ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై సవాల్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదోపవాదాలు పూర్తి చేసిన ఢిల్లీ కోర్టు ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.