పవన్ కళ్యాణ్‌కి కోర్టు నోటీసులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక న్యాయవాది. అలాగే అయోధ్యకు పంపిన లడ్డూలలో కూడా కల్తీ నెయ్యి వాడారంటూ పవన్ వ్యాఖ్యానించారని కేసు వేశారు. దానిని సోషల్ మీడియా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.