KPHB లో ప్రేమజంట ఆత్మహత్య
ప్రేమించుకుని కలిసి బ్రతకలేనప్పుడు కలిసే చనిపోదామనుకున్నారు ఆ ప్రేమజంట. హైదరాబాద్ నగరంలోని KPHB లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతి అనే ప్రేమికులు KPHB ఫేజ్-7లో నివాసం ఉంటున్న కృష్ణ అనే స్నేహితుడి రూమ్‌కు వచ్చారు. కృష్ణ ఫ్రెండ్ వివాహానికి వెళ్లి వస్తానని బయటకు వెళ్లిన సమయంలో ప్రేమికులిద్దరూ ఉరి వేసుకునిఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వీరిద్దరిదీ భీమవరం దగ్గరలోని గొల్లవానిదిబ్బ అనే గ్రామంగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

