ఎక్కడికెళ్లినా లెక్కలేనంత మంది జనం…
నిజామాబాద్: జిల్లాలో ఎక్కడికెళ్లినా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్ల పాలనకు చరమగీతం పాడాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణాలోను రాబోతోందన్నారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ బుధవారం నామినేషన్‌కు ఆయన వెంటే కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారని చెప్పారు. తనకు ఒక ఛాన్స్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇందూరు నగరాన్ని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ముత్యాలమ్మ గుడికి లక్ష రూపాయల విరాళం అందజేసిన అభ్యర్థి -బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ.