కర్ణాటకలో ప్రారంభమైన కౌంటింగ్ .. ఆధిక్యంలో కాంగ్రెస్
కర్ణాటకలో ఈ రోజు ఉదయం నుంచి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ కౌంటింగ్‌లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కర్ణాటకలో ఉన్న మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్ తొలి దశ కౌంటింగ్‌లోనే ఏకంగా 131 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మరోవైపు బీజేపీ పార్టీ ఆధిక్యం 90 నుంచి 78 స్థానాలకు పడిపోయింది. జేడీఎస్ పార్టీ మాత్రం నిరాశజనకంగా కేవలం 14 చోట్ల మాత్రమే లీడ్ కనబరుస్తోంది. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

