ఏపీలో మొదలైన ఓట్ల లెక్కింపు
ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఏపీలో రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏపీలో 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్థానాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.

