Home Page SliderTelangana

తెలంగాణాలో కల్వకుంట్ల SCAMILY కి కౌంట్ డౌన్ మొదలయ్యింది: రేవంత్ రెడ్డి

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ఉద్దేశిస్తూ..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.కాగా ఈ ట్వీట్‌లో తెలంగాణాలో కల్వకుంట్ల SCAMILY కౌంట్ డౌన్ మొదలయ్యిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలంగాణాలో దగాపడిన  యువత,ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది మోసపోయిన దళితుడు,రక్షణ లేని ఆడకూతురు చెప్తున్న కౌంట్ డౌన్.ఇది ఫించన్ కోసం కాళ్లు అరిగేలా తిరిగిన పెద్ద మనిషి చెప్తున్న కౌంట్ డౌన్. కాగా ఈ 52 రోజుల కౌంట్ డౌన్..4కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం అని రేవంత్ రెడ్డి విమర్శించారు.దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులను ఎంపిక చేయడంలో కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర,బహిరంగ సభల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.