పత్తి పోటెత్తింది.. ధర పడిపోయింది..
రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు ఇవాళ భారీగా పత్తి బస్తాలు వచ్చాయి. ముఖ్యంగా ఖమ్మం సీసీఐ కేంద్రానికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగు జిల్లాల రైతులు పెద్ద మొత్తంలో పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చారు. దీంతో వ్యాపారులు కుమ్మక్కై ధరను అమాంతం తగ్గించారు. దీంతో తగ్గిన ధరతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ పత్తి రూ. 6200 దాటడం లేదని, దీంతో తమకు కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రావడంలేదని రైతులు వాపోయారు. మరోవైపు వరంగల్ మార్కెట్ కు కూడా భారీగా పత్తి బస్తాలు వచ్చాయి. దళారులు రోజురోజుకు ధర తగ్గిస్తున్నారని రైతులు అంటున్నారు. మొన్నటికంటే ఇవాళ రూ.200 రేటు తగ్గిందని తెలిపారు. తేమ ఎక్కు వగా ఉందని ధర తగ్గిస్తున్నారని చెప్పారు.

