Home Page SliderTelangana

భద్రాద్రి రాముల వారి గుడిలో పట్టాభిషేకం.. 25 నుండి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

భద్రాచలం: భద్రాద్రి రాములోరి కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను మార్చి 25వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రెండు వేడుకల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.