Home Page SliderInternational

చైనా ల్యాబ్ లీక్ ప్రమాదం కారణంగానే కరోనా వైరస్ – అమెరికాకు క్లారిటీ

చైనాలో ప్రమాదవశాత్తు లేబొరేటరీ లీక్ కారణంగానే… కరోనావైరస్ మహమ్మారికి కారణమైందని అమెరికా తాజా ఇంటెలిజెన్స్ నిర్ధారిస్తోందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ WSJ నివేదించింది. వైరస్ ఎలా ఉద్భవించింది.. ఎలా మార్పు చెందిందనేదానిపై ఎనర్జీ డిపార్ట్‌మెంట్ గతంలో ఒక నిర్ణయానికి రాలేదంది. ఐతే తాజాగా ఆ విషయమై క్లారిటీ వస్తోంది. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం ద్వారా 2021లో అసలేం జరిగిందన్నదానిపై ఆధారాలను అమెరికా సేకరిస్తోంది. వైరస్ ఎలా ఉద్భవించిందనే దానిపై గతంలో నిర్ణయించలేదని… వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్ధారిచింది.

ఐదు పేజీల కంటే తక్కువ ఉన్న అప్‌డేట్‌ నివేదికను కాంగ్రెస్ కోరలేదని తెలుస్తోంది. కానీ అమెరికా చట్టసభ సభ్యులు, ముఖ్యంగా హౌస్ సెనేట్ రిపబ్లికన్లు, మహమ్మారి మూలాలపై వారి స్వంత పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. మరింత సమాచారం కోసం బైడెన్ పరిపాలన, ఇంటెలిజెన్స్ విభాగంపై వారు ఒత్తిడి తెస్తున్నారు. చైనా లేబొరేటరీలో జరిగిన ప్రమాదం ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పడానికి ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌‌తో ఇంధన శాఖ చేతులు కలిపిందని తెలుస్తోంది.

2021లో ల్యాబ్ లీక్ ఫలితంగా ఈ మహమ్మారి సంభవించి ఉంటుందని FBI గతంలో నిర్ధారణకు వచ్చింది. ఇప్పటికీ ఇదే అభిప్రాయంతో ఉంది. వుహాన్ ల్యాబ్ లీకేజీ కారణంగానే కరోనా బయటకు వచ్చిందన్న అభిప్రాయం అమెరికా అధికారులు ఎనర్జీ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బిఐ తాజాగా భావిస్తున్నాయి. కోవిడ్-19 ఎలా ఉద్భవించిందనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికీ తర్జనభర్జనపడుతున్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన మహమ్మారి కారణంగా 10 లక్షల కంటే ఎక్కువ మంది అమెరికన్లు మరణించారని WSJ నివేదించింది. ఐనప్పటికీ వైరస్ పుట్టుక విషయమై ఇంకా అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భిన్నాభిప్రాయాలతో ఉన్నాయని అభిప్రాయపడింది. జాతీయ ఇంటెలిజెన్స్ ప్యానెల్‌తో పాటు మరో నాలుగు ఏజెన్సీలు ఇప్పటికీ ఈ మహమ్మారి సహజంగా వ్యాపించిన కారణంగానే సంభవించి ఉండవచ్చునని నమ్ముతున్నాయి.

ఐతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అధికారులు పేరు పెట్టని మరో ఏజెన్సీ ల్యాబ్-లీక్, నేచురల్-ట్రాన్స్మిషన్ థియరీల మధ్య ఎలాంటి నిర్ణయానికి రాలేదు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ వ్యవహారాన్ని ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి నిరాకరించారు. మహమ్మారి మూలాల గురించి సాధ్యమైనంతవరకు గుర్తించాలని ప్రెసిడెంట్ బైడెన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలోని ప్రతి భాగాన్ని పదేపదే ఆదేశించారని అన్నారు. “ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో భాగమైన జాతీయ ల్యాబ్‌లు ఓ అంచనాకు రావాలని ప్రెసిడెంట్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో గుర్తించడానికి ప్రతి సాధనాన్ని ఉపయోగించాలనుకుంటున్నారు” అని సుల్లివన్ చెప్పారు.

అమెరికా 2021 ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, కోవిడ్ -19 వైరస్ మొదట చైనాలోని వుహాన్‌లో వ్యాపించింది. నవంబర్ 2019 తర్వాత కాదు. మహమ్మారి మూలం విద్యావేత్తలు, గూఢచార నిపుణులు, చట్టసభ సభ్యుల మధ్య తీవ్రమైన చర్చకు సంబంధించిన అంశమని భావిస్తోంది. మహమ్మారి ఆవిర్భావం అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కరోనా వ్యాప్తిని గురించి సమాచారాన్ని చైనా నిలుపుదల చేస్తోందని అమెరికా అధికారులు ఆరోపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలపై పరిమితులు విధించిన చైనా, వైరస్ తన ల్యాబ్‌లలో లీక్ అయి ఉండవచ్చంది. అదే సమయంలో చైనా బయట నుంచి కూడా వచ్చి ఉండొచ్చంది. కోవిడ్ -19 మూలాలపై దాని అభిప్రాయాలలో ఏదైనా మార్పు ఉందా అనే దాని గురించి వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనలకు చైనా ప్రభుత్వం స్పందించలేదు. ఏదేమైనా, చైనా విస్తృతమైన కరోనావైరస్ పరిశోధనకు వుహాన్ కేంద్రంగా ఉందని మాత్రం ప్రపంచమంతటా ఒక భావన నెలకొంది. కొంతమంది శాస్త్రవేత్తలు, US అధికారులు ల్యాబ్ లీక్ అనేది మహమ్మారి ప్రారంభానికి దారితీసిందని స్పష్టం చేస్తున్నారు.