వామ్మో.. భారత్ లో మళ్లీ కరోనా వైరస్..
భారత దేశాన్ని కరోనా మళ్లీ భయపెడుతోంది. కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదు. మూడేళ్ల నుంచి ఎలాంటి భయం లేకుండా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి భయపెడుతోంది. ఇండియాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ నటుడు మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. అయితే.. కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.