InternationalNews Alert

చైనాలో మళ్లీ పంజా విసిరిన కరోనా

కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. వైరస్ వ్యాప్తితగ్గడంతో దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేశారు. కానీ, చైనాలో మాత్రం కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. అక్టోబర్ మెదటి వారంలో జాతీయ సెలవులు దినాలను ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి ఎంజాయ్ చేశారు. దీంతో కొవిడ్-19 కేసులు సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు వచ్చేవారం బీజింగ్‌లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగానే చైనాలోని ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. సినిమా థియేటర్లు, ఇతర వినోద కార్యక్రమాలను అధికారులు నిలిపివేశారు.

తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోనిఫెన్‌యాంగ్ నగరంలో గతంకంటే కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగినట్లు పరీక్షల్లో తేలడంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. అదేవిధంగా షాంగ్జీ ప్రావిన్స్‌కు సమీపంలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహోట్ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. బయటి నుంచి వచ్చే వాహనాలు, ప్రయాణీకులను నగరంలోకి ప్రవేశాన్ని నిషేధించారు. హోహోట్ ప్రాంతంలో సుమారు గడిచిన 12 రోజుల్లో 2వేల కంటే ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్టు పార్టీ స‌మావేశాల‌పై కొవిడ్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు ముందుగానే ప‌లు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌లు అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణలో భాగంగా కఠిన ఆంక్షలు చేస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు