Home Page SliderNational

భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేసేందుకు సిద్దమౌతున్నట్లు కన్పిస్తోంది. కాగా గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 4,435 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 23,091కి చేరుకుంది. దేశంలో గత కొన్ని రోజులుగా 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం అత్యధికంగా 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా కరోనా నుంచి తమను తాము కాపాడుకునేందుకుగాను మాస్కులు ధరిస్తూ..వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.