Home Page SliderTelangana

మైలార్‌దేవ్‌పల్లిలో కార్డన్ సెర్చ్

టిజి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో శాస్త్రీపురం, అక్బర్‌కాలనీ, వట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. ఓ ఆటోలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. ఆటోతో పాటు గుట్కాను సీజ్ చేసి డ్రైవర్ షేక్ మహ్మద్ అదుపులోకి తీసుకున్నారు.