1500 మందితో కూంబింగ్..19 మంది హతం
బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న 10 మంది భద్రతాబలగాలను మావోయిస్టులు గత వారం రోజుల కిందట మందుపాతర(ల్యాండ్‌మైన్)తో మట్టుబెట్టిన సంగతి విదితమే.దీనికి ప్రతీకారంగా భద్రతా బలగాలు బీజాపూర్ జిల్లా మద్దేడు అటవీ ప్రాంతంలో జల్లెడపడుతున్నారు .దాదాపు 1500 మంది అధికారులు,సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోలకు,భద్రతాబలగాలకు మధ్య ఎదురెదురుగా జరిగిన కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు హతమయ్యారు.మరికొంత మంది పరారీలో ఉన్నారు.వీరంతా తెలంగాణ బోర్టర్‌కి పరారైనట్లు నిఘా వర్గాలు తెలిపాయి.కాగా తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని బీజాపూర్ పోలీసులు సమాచారం అందించారు.బీజాపూర్ నుంచి పరారైన వారంతా తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని హెచ్చరించారు.

