హైదరాబాద్ GHMCలో పోస్టర్ల కలకలం
హైదరాబాద్ GHMCలో ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదాస్పదమైయ్యాయి. రిటైర్డ్ అయిన ఆంధ్ర అధికారికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన ఆంధ్ర అధికారి సరైన నిర్ణయాలు తీసుకోకవోవడం వల్లే GHMCలో ప్రైవేటీకరణ వంటి అంశాలు వెల్లువెత్తాయని పోస్టర్లలలో పేర్కొన్నారు. దీంతో ఇది కాస్త తీవ్ర దుమారం రేపుతోంది. తన అసమర్థ పనితీరుతో తమను కష్టాల్లో పడేస్తున్నారని నిరసనగా GHMC ఉద్యోగులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ విధంగా GHMC అధికారికి వ్యతిరేకంగా GHMC ఉద్యోగులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు.

