NewsTelangana

తెలంగాణా గ్రూప్-1 ఎగ్జామ్‌పై వివాదం

తెలంగాణాలో ఈ నెల 16వ తేదిన గ్రూప్-1 ఎగ్జామ్‌ను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్ష విధానంపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఈ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్షకు హాజరయిన మహిళ అభ్యర్థులను నగలు ధరించిన కారణంగా టీఎస్‌పీఎస్సీ పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. పరీక్ష రాయాలంటే నగలు తీసి రావాలని అధికారులు మహిళ అభ్యర్థులను ఆదేశించారు. దీంతో వారంతా నగలు తీసి పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ సమయంలో తీసిన వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా హిందు మహిళా అభ్యర్థులను అవమానించారని సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహిళలను నగలు తీయించడంపై  బీజేపీ నేతలు అభ్యంతరాలు తెలిపారు. మైనార్టీ అభ్యర్థులను చెక్ చేయకుండా..కేవలం హిందూ మహిళ అభ్యర్థులను మాత్రమే చెక్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై టీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందించారు. గ్రూప్-1 ఎగ్జామ్‌కు హాజరయిన అభ్యర్థులందరినీ అధికారులు చెక్ చేశారని.. ఎంపిక చేసిన వీడియోలను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్‌ చేశారని విమర్శించారు.