Andhra PradeshBreaking NewsHome Page Slider

త‌మ్మినేని డిగ్రీ ప‌ట్టాపై వివాదం

వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టనుంది. వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన తమ్మినేని సీతారాం.. నకిలీ డిగ్రీ ధ్రువీకరణ పత్రాలతో మోసం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. త‌మ్మినేని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే ఆరోపించారు. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎస్. సురేశ్ కుమార్ దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.