ముదురుతున్న టీడీపీ జనసేన వర్గాల వివాదాలు
దెందులూరులో కూటమి కార్యకర్తల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కాకినాడ, ఏలూరు జిల్లాలలో కూడా జనసేన, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర తగాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పైడి చింతపాడులో పెన్షన్ల పంపిణీ సందర్భంగా పరస్పర దాడుడు తీవ్రమయ్యాయి. ఈ గొడవలపై నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తానని దెందులూరు జనసేన ఇన్‌ఛార్జ్ వెల్లడించారు. టీడీపీ వర్గాల దాడులను అడ్డుకోవాలని పవన్‌కు విజ్ఞప్తి చేస్తానని పేర్కొన్నారు. పవన్ ఏలూరు పర్యటనలో ఆయనను కలిసి సమస్యలు వివరించనున్నట్లు తెలిపారు. మరోపక్క దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీకి చెందిన ఆయన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం మాస్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికి వస్తే ఊరుకునేది లేదని, మౌనంగా ఉండేది లేదని జనసేన కార్యకర్తలను హెచ్చరించారు. అరాచక శక్తులు జనసేనలో చేరి టీడీపీ వారిపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా కూటమిలో చేరిన వారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.