Andhra PradeshHome Page Slider

కారును తీసివేయకుండా సిమెంట్ రోడ్డు వేసిన కాంట్రాక్టర్..

వీధుల్లో రోడ్డు వేసేటప్పుడు అడ్డుగా ఉన్న వస్తువును తీసి పక్కనపెడతాం. ఆ పాటి విచక్షణ కూడా మరచిపోయారు ఓ కాంట్రాక్టర్. ఓ ఇంటి ముందు నిలిపిన కారును పక్కకు తీసేయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు కాంట్రాక్టర్. ఈ ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో జరిగింది. బుద్ధి వెంకట రమణ అనే వ్యక్తి ఇంటి నుంచి చెన్నంశెట్టి సుబ్బారావు ఇంటి వరకూ ఇటీవల సిమెంట్ రోడ్డును నిర్మించారు. అయితే బుద్ధి వెంకట రమణ ఇంటి ముందు నిలిపిన కారును అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. అయితే.. ఏడాదిగా ఆ కారు అక్కడే ఉందని, తీయమని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. దీంతో కారు నిలిపిన భాగాన్ని వదిలి కాంట్రాక్టర్ సిమెంట్ రోడ్డు వేశారు.