బీజేపీ ఐడియాతోనే తెలంగాణలో పోటీ: నాదెండ్ల మనోహర్
బీజేపీ సూచనలతోనే తమ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నందుకే అక్కడ బరిలో నిలిచాం. ఎన్నికల షెడ్యూల్ రాగానే బీజేపీ కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్‌ను కలిసి పోటీ చేయాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. గతంలోనే తెలంగాణలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావించేవారు. అక్కడి క్యాడర్‌ను ప్రోత్సహించేందుకు పోటీ చేస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

