Home Page SliderTelangana

రోడ్డుపై కంటైనర్ బోల్తా.. లక్డీకాపూల్ లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లక్డీకాపూల్ వద్ద రోడ్డుపై కంటైనర్ పడిపోవడంతో శుక్రవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో లక్డీకాపూల్‌లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు రెండు భారీ క్రేన్‌లతో కిందపడిన కంటైనర్‌ను తొలగించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.