Home Page SliderTelangana

మన్యంలో కంటెయినర్ ఆసుపత్రి

టిజి: గిరిజన వాసులకు డాక్టర్ సేవలందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ రాష్ట్రంలోని తొలిసారి ఓ వినూత్న ప్రయోగం చేశారు. కంటెయినర్ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామంలో నాలుగు పడకల కోసం సుమారు రూ.7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించారు. ఈ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.