Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsviral

లెక్సస్ ఇండియా కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్

రూ. కోటికి పైగా విలువైన కారును సాంకేతిక లోపాలతో వినియోగదారుడికి అమ్మినందుకు లెక్సస్ ఇండియా కంపెనీకి ఛత్తీస్ గఢ్ వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ హైబ్రిడ్ కారును మార్చాలని, లేదా దాని పూర్తిధరను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఛత్తీస్ గఢ్ వినియోగదారుల కమిషన్ ఈ మేరకు తీర్పునిచ్చింది. రాయపూర్ కు చెందిన ఒక సంస్థ రూ. కోటికి పైగా విలువైన కారును 2023 అక్టోబరు 13న కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన కొన్నిరోజులకే ఆగిపోవడం ప్రారంభించింది. ఇతర అంతరాయాలు ఏర్పడ్డాయి. ఢిల్లీలోనో, ముంబయిలోనో మరమ్మతు చేయిస్తామని కారును సంబంధిత కంపెనీ ప్రతినిధులు భువనేశ్వర్ కు పంపించి, నాలుగు నెలల తర్వాత తిరిగి వినియోగదారునికి అప్పగించారు. కారుపై మరిన్ని గీతలు పడటమే కాకుండా మాటిమాటికీ ఆగిపోయేది. దీంతో వినియోగదారుడు విసిగిపోయి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. తమది పెద్ద కంపెనీ కావడం వల్ల సమస్యను త్వరగా పరిష్కరించలేకపోయామని కంపెనీ ప్రతినిధి వాదించారు. హైబ్రిడ్ వాహనాలలో విద్యుత్తు లీకేజీల వంటి సమస్యలు తీవ్ర ప్రమాదమని కమిషన్ మండిపడింది. ఫిర్యాదుదారుడికి 45 రోజుల్లోపు అదే మోడల్ కొత్తకారును అందించాలని, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భరించాలని ఆదేశించింది.