చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి
టిజి: చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం 98 శాతం పూర్తైనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫొటోలను విడుదల చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు రూ.434 కోట్లతో నిర్మితమవుతున్న ఈ టెర్మినల్ తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా నిలవనుందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇది పూర్తయితే 50 శాతం మంది ప్రయాణికులు సిటీలోకి రాకుండా ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.