Andhra PradeshHome Page Slider

అమరావతి నిర్మాణం వేగవంతం.. ప్రాంతంలో నిర్మాణాల అధ్యయనం..

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు వేగవంతం అయ్యాయి. నిన్న కేంద్రబడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఏకంగా రూ.15 వేల కోట్లు ప్రకటించడంతో రాజధాని నిర్మాణం ఊపందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కమిటీని రూపొందించింది. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి రాష్ట్రప్రభుత్వం సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆర్‌అండ్‌బీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీసీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీయే, ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుండి ప్రతినిధిని కూడా కమిటీలో నియమించారు. ఈ కమిటీ రాజధాని అమరావతిలో రహదారులు, పైపులైన్లు వంటి అంశాలను పరిశీలిస్తుంది. నిలిచిపోయిన నిర్మాణ పనులను ఎక్కడ నుండి ప్రారంభించాలన్న అంశంపై కమిటీ సూచనలు చేయనుంది.